హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆ దేశ విదేశాంగ మంత్రి హోసైన్ తో పాటు మరికొంత మంది ఉన్నతాధికారులు మృతి చెందారు. తీవ్ర ఇబ్బందుల నడుమ ఎట్టకేలకు రెస్క్యూ టీం ఘటనా స్థలాన్ని కనిపెట్టింది. అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా లో హెలికాప్టర్ కూలిపోయింది. దట్టమైన అడవులు, పొగమంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దూరంగా అంబులెన్స్ ను ని నిలిపి కాలినడకనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గత కొంత కాలంగా జరుగుతోన్న ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో రైసీ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.