హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు సంఘీభావాన్ని తెలిపాయి. సంతాపాన్ని ప్రకటించాయి.
రైసీ మృతి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అయిదు రోజుల సంతాపం తెలిపింది. ఈ అయిదు రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించట్లేదని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, సమావేశాలను కూడా జరపకూడదని సూచించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవంక- భారత్‌లో అన్ని చోట్లా కూడా ఇరాన్ జాతీయ జెండాలను అవనతం చేశారు. రైసీ మృతికి సంతాప సూచకంగా ఇరాన్ రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ ఆఫీస్, హైకమిషనర్ కార్యాలయాలపై ఎగురవేసిన ఆ దేశ జాతీయ పతాకాలను అవనతం చేశారు. అయిదు రోజల పాటు వాటిని అలానే ఉంచనున్నారు.