ఇరాన్ దేశాధ్యక్షుడు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఓ మీడియా సంస్థలో వార్తా కథనాలు వచ్చాయి. ఆ హెలికాప్టర్ కూలి ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు అజర్‌బైజాన్ లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ కాన్వాయ్‌లో మరో రెండు హెలికాప్టర్లు ఉన్నట్లు తెలిపింది. అధ్యక్షుడితోపాటు విదేశాంగ మంత్రి హోసేన్ అమిరాబ్దోల్లాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్లు చెప్పింది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నందున గాలింపు, సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు పేర్కొంది.