HomeతెలంగాణIRCTC:జూన్ 10 న మాతా వైష్ణో దేవి ఆలయానికి భారత్ గౌరవ్ రైలు

IRCTC:జూన్ 10 న మాతా వైష్ణో దేవి ఆలయానికి భారత్ గౌరవ్ రైలు

IRCTC: ఐ ఆర్ సీ టి సీ “మాతా వైష్ణో దేవి, హరిద్వార్ మరియు రిషికేశ్ ” అనే కొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమతుంది . ఈ రైలు దేశంలోని ఉత్తర ప్రాంతాలలోని ముఖ్యమైన యాత్రికులు మరియు చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తు తెలంగాణ మరియు మహారాష్ట్రలోని ఏడు ముఖ్యమైన స్టేషన్లలో ఎక్కేందుకు /దిగేందుకు సౌకర్యాన్ని అందిస్తుంది . ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రల పట్ల ప్రజల ఆసక్తిని తెలియజేస్తూ, మాతా వైష్ణో దేవి ఆలయం వైపు కొత్త టూరిస్ట్ రైలును ప్రకటించిన కొద్ది రోజుల్లోనే 50% కంటే ఎక్కువ సీట్లు బుక్ చేయబడ్డాయి.


ప్యాకేజీ వివరాలు

ఈ “ హరిద్వార్ మరియు రిషికేశ్తో మాతా వైష్ణోదేవి ” టూరిస్ట్ సర్క్యూట్ రైలు సికింద్రాబాద్లో మొదలై , తెలంగాణలోని కాజీపేట , పెద్దపల్లి , రామగుండం మరియు సిర్పూర్ కాగజ్ నగర్ల తో పాటు మహారాష్ట్రలోని బల్హర్షా , వార్ధా మరియు నాగ్పూర్ స్టేషన్ లలో ఎక్కేo దుకు / దిగేoదుకు ఐ ఆర్ సీ టి సీ సౌకర్యాన్ని అందిస్తుంది . ఈ రైలు కత్రా , ఆగ్రా, మథుర , బృందావన్ , కత్రా , హరిద్వార్ మరియు రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేస్తుంది . కత్రా స్టేషన్ నుండి వైష్ణో దేవి ఆలయానికి పోనీ / డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి. ఐ ఆర్ సీ టి సీ ఈ అంశంలో పర్యాటకులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు దర్శనం తర్వాత సౌకర్యవంతంగా తిరిగి రావడానికి ప్రయాణంలో తగినంత సమయం కేటాయించబడుతుంది.

సౌకర్యాలు
మొత్తం ట్రిప్ 8 రాత్రులు / 9 రోజుల వ్యవధిలో పూర్తిచేయబడుతుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణా రెండింటితో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు టూర్ ఎస్కార్ట్‌లు , భద్రత , పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ప్రయాణ బీమా సౌకర్యం మొదలైనవి లభ్యమౌతాయి .
మరిన్ని వివరాల కోసం ఎవరైనా ఐ ఆర్ సీ టి సీ వెబ్సైట్ను సందర్శించవచ్చు: http://www.irctctourism.com బుకింగ్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG05 మరియు సికింద్రాబాద్ కార్యాలయం ఫోన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. : 9701360701, 8287932228, 9110712752
హరిద్వార్ & రిషికేష్తో మాతా వైష్ణోదేవి – భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

పర్యటన ప్రణాళిక సికింద్రాబాద్ – ఆగ్రా- మథుర – బృందావన్ – కత్రా ( వైష్ణోదేవి ) – హరిద్వార్ – రిషికేశ్ – సికింద్రాబాద్
పర్యటన తేదీ 10.06.2023 12:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి
వ్యవధి 10.06.2023 నుండి 18.06.2023 వరకు 8 రాత్రులు/9 రోజులు
ఎక్కేందుకు /దిగేందుకు సౌకర్యంగల స్టేషన్లు సికింద్రాబాద్ , కాజీపేట్ , పెద్దపల్లి , రామగుండం , సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా , వార్ధా & నాగ్పూర్

ఒక్కొక్కరికి ధర
(జీ ఎస్ టి తో సహా) ఎకానమీ కేటగిరీ (స్లీపర్ ): రూ. 15435/-
ప్రామాణిక వర్గం (3ఏ. సీ ): రూ. 24735/-
కంఫర్ట్ కేటగిరీ (2 ఏ. సీ): రూ. 32480/-

Recent

- Advertisment -spot_img