సమ్మర్ వచ్చేసింది.. పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి అంతా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు.అందమైన ఫేమస్ ప్రదేశాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసం IRCTC సూపర్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లోనే మంచి టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది.
హైదరాబాద్ నుంచి ‘స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం (SPIRITUAL TELANGANA WITH SRISAILAM)’ పేరుతో స్పెషల్ టూర్ అనౌన్స్ చేసింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్ లోని ఫేమస్ ప్రదేశాలతో పాటు శ్రీశైలం, యాదగిరి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను చూసి వస్తారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ముందుగా హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ లను విజిట్ చేసి.. ఆ తర్వాత శ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి చివరగా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో ఈ టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
తొలి రోజు యాత్రికులను హైదరాబాద్ లో పికప్ చేసుకొని.. హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. ఆ తర్వాత హోటల్ కు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు. రెండవ రోజు ఉదయాన్నే 5 గంటలకు శ్రీశైలం బయల్దేరి.. అక్కడ మల్లిఖార్డున స్వామి చేసుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు. మూడవ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత బిర్లా మందిర్ వెళ్తారు. ఆ తర్వాత గొల్కోండ ఖిల్లా, అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస ఉంటుంది. ఇక నాలుగవ రోజు ఉదయం యాదాద్రికి తీసుకెళ్లి అక్కడ దేవుడి దర్శనంతో పాటు సురేంద్రపురి సందర్శిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది.