IRCTC వెబ్‌సైట్ డౌన్ అవడంతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెబ్‌సైట్ మెయింటనెన్స్ నిర్వహణ కారణాలతో సర్వర్ డౌన్ అయినట్లు సంస్థ పేర్కొంది. మధ్యాహ్నం గంటపాటు ఈ అవాంతరం ఉంటుందని తెలిపింది. ఈ అంతరాయంతో ప్రయాణికులు తమ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.