Homeజిల్లా వార్తలు'ఉపాధి' హామీ పథకంలో అవకతవకలు..!

‘ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి రామన్ రావు అధ్యక్షతన జరిగింది సామాజిక తనిఖీ బృందం వారం రోజులుగా ఉపాధి హామీలో జరిగిన అవకతవకల పై వివరాలు సేకరించారు. గుర్తించిన అంశాలను సామాజిక తనిఖీ ప్రజా వేదిక ద్వారా బహిర్గతం చేశారు.వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. మార్దండ గ్రామంలో అంధ వ్యక్తి పని చేసినట్లు రూ.10,360 నగదు చెల్లించిన విషయం వెలుగుచూసింది. రాంపూర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ అంజాగౌడ్ తన భార్య పని చేయకున్నా డబ్బులు చెల్లించడం వంటివి అనేకం విషయాలు బహిర్గతమయ్యాయి.

Recent

- Advertisment -spot_img