కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విశాల్ కు తెలుగులోనూ విపరీతమైన అభిమానులున్నారు. సూపర్ హిట్ సినిమాలతో విశాల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విశాల్ చివరిసారిగా గతేడాది ‘రత్నం’ సినిమాలో కనిపించాడు. అయితే తాజాగా విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.. మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు.. చేతులు కూడా వణుకుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో విశాల్ ఆరోగ్యంపై పలు చర్చలు జరుగుతున్నాయి.
విశాల్ ఆరోగ్య పరిస్థితికి బాలా దర్శకత్వం వహించిన ”వాడు వీడు” సినిమానే కారణం అని వార్తలు వస్తున్నాయి ‘వాడు వీడు’ సినిమా చేసినప్పుడు బాలా తమిళ చిత్రసీమలో పీక్‌లో ఉన్నాడు. సినిమాలో బాలా నటించేందుకు నటీనటులు విపరీతమైన ఆసక్తిని కనబరిచారు.. ఈయన చెబితే కొండపై నుంచి దూకేందుకు కూడా నటీనటులు సిద్ధమయ్యారు.. ఈ నేపథ్యంలోనే విశాల్ ‘వాడు వీడు’ సినిమాలో విశాల్ విభిన్నమైన కన్ను ఉన్న వ్యక్తిగా నటించాడు.. దానికి కారణం విశాల్ కళ్లు “అతను కొన్నేళ్లుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నాడు. ఈ నొప్పిని ఎదుర్కోవటానికి, అతను కొన్ని అలవాట్లకు బానిస అయ్యాడు, అది తనను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది” అని వార్తలు వస్తున్నాయి.