Homeహైదరాబాద్latest Newsవిజయ్ దేవరకొండకి బంపర్ హిట్టేనా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న లీక్స్..!!

విజయ్ దేవరకొండకి బంపర్ హిట్టేనా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న లీక్స్..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD12’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా బాలయ్య ”డాకు మహారాజ్” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ వంశీ విజయ్ దేవరకొండ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. అలాగే ఫస్ట్ పార్ట్ చూసి ప్రేక్షకులు ఇచ్చే రెస్పాన్స్ ఆధారంగా సెకండ్ పార్ట్ ఎప్పుడు చేయాలనేది ప్లాన్ చేస్తాం అన్నారు. ఈ సినిమా కంటెంట్ చూసిన తర్వాత అందరూ ఇలాంటి సినిమానా వచ్చింది అని ఆశ్చర్యపోతారుని తెలిపారు. ఇటీవల మా నాన్నగారు, ఎడిటర్‌ నవీన్‌ ఈ సినిమా ఫస్ట్‌ ఆఫ్‌ చూశారుని.. ”జెర్సీ” సినిమా తీసిన గౌతమ్ నా ఈ సినిమా తీసింది అని నాతో అన్నారు. ఈ సినిమా ఎడిట్ చేయని మొదటి రెండు గంటలు చూసిన తర్వాతే అలా అనిపించింది ఇంకా సినిమా థియేటర్ వెర్షన్ చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనాల్సిందే అని అన్నారు. నా ఎడిటర్‌తో నాకు ఐదారేళ్ల ప్రయాణం ఉంది.. ఆయన సినిమా బాగుందని చాలా అరుదుగా చెప్పుతారు. అలాంటిది మా ఎడిటర్ నాకు స్వయంగా ఫోన్ చేసి..’నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడాల్సిందే’ అని అన్నారు. అయితే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ చాలా రికార్డులను బద్దలు కొట్టబోతున్నాడు అని తెలుస్తుంది. దీంతో విజయ్ దేవరకొండకు ఈసారి ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారెంటీ అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img