బరువు తగ్గడానికి భోజనానికి ముందు నీళ్లు తాగడం గురించి మీరు వినే ఉంటారు. భోజనానికి ముందు నీళ్లు తాగడం నిజంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందా? భోజనానికి ముందు నీళ్లు తాగితే మంచిది అనేవారు కొందరుంటే.. చెడు అనేవారూ కూడా ఉన్నారు. అయితే, బరువు తగ్గే విషయానికి వస్తే, భోజనానికి 20-30 నిమిషాల ముందు నీళ్లు తాగడం అనేది మంచి ఆలోచన. భోజనానికి అరగంట ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని పొంది, తక్కువ తినడానికి సహాయపడుతుందని చెబుతారు. అలాగే, జీర్ణక్రియ సరిగ్గా ఉండేందుకు భోజనానికి 30 నిమిషాల ముందు ఓ గ్లాసు నీరు తాగాలి. అలాగే, ఆహారం తీసుకున్న 40 నిమిషాల తరువాత నీటిని తీసుకోవాలి.