అమెరికా కంపెనీల నుంచే మందులు కొనాలంటూ ట్రంప్ ఆర్డర్
న్యూఢిల్లీః దేశీ ఫార్మా రంగంపై అమెరికా ప్రెసిడెంట్ డొనల్డ్ ట్రంప్ ఆగస్టు ఫస్ట్ వీక్‌లో జారీ చేసిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్స్ ఎఫెక్ట్ చూపనున్నట్లు ఫార్మా రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్డర్ ప్రకారం ఇక నుంచి అమెరికాలో తయారైన మందులను, మెడికల్ ఇక్విప్‌మెంట్‌ను మాత్రమే అమెరికా ఫార్మా కంపెనీలు కొనాలని ఆర్డర్‌లో పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మన దేశానికి చెందిన ఫార్మా కంపెనీలు ఎగుమతి చేసే మందుల్లో దాదాపు 35 శాతం వరకు అమెరికా కంపెనీలు కొనుగోళ్లు చేస్తుంటాయి. గత ఏడాది అమెరికాతో 510 బిలియన్ డాలర్ల ఫార్మ బిజినెస్ జరగడం విశేషం. అమెరికా ఔషధాల నియంత్రణ సంస్థ(యూఎస్ ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన 664 ఫార్మా యూనిట్లు మన దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో మందుల తయారీ 30-40 శాతం తక్కువ అవుతున్నందున అమెరికా ఫార్మా కంపెనీలు ఇండియాపై ఆసక్తి కనబరుస్తుంటాయని ఫార్మా రంగ వేత్తలు పేర్కొంటున్నారు. అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ కేవలం ప్రభుత్వ కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుందని, ప్రైవేట్ ఫార్మాపై ఇది ప్రభావం చూపదని దేశీ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం.
దేశీ ఫార్మాకు కష్టాలేనా?
RELATED ARTICLES