Homeహైదరాబాద్latest Newsఉపవాస సమయంలో తప్పనిసరిగా తినాలా..? తింటే ఏం తినాలి?

ఉపవాస సమయంలో తప్పనిసరిగా తినాలా..? తింటే ఏం తినాలి?

మహా శివరాత్రి సందర్భంగా చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం ఉండే వారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. వీటితో పాటు నీళ్లు కలిపినవి, బంగాళదుంప, కందగడ్డలు తినవచ్చని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు.

సాత్విక ఆహారం అంటే..?
సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత పదార్థాలను తీసుకోవడం. సాత్విక ఆహారం తినడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పెరుగుతుందని భావిస్తారు.

  • తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు తినడం
  • మాంసం, గుడ్లు, సముద్ర ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్, చాలా మసాలా దినుసులను తినకపోవడం
  • ఉప్పు, చక్కెర, వేయించిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం

Recent

- Advertisment -spot_img