హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ యాప్‌లో ఓ వ్యక్తి టూవీలర్‌ను బుక్ చేసుకున్నాడు. అది కాస్త మార్గ మధ్యలో సతాయించింది. పెట్రోల్ అయిపోయిందట. ఈ టైంలో ఇంకొకరెవరైనా వేరే వెహికల్ బుక్ చేసుకొని పని చూసుకుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తను దిగబోనని తెగేసి చెప్పేశాడట. దీంతో టూవీలర్ డ్రైవర్ ఆవ్యక్తిని అలానే కూర్చొబెట్టుకొని తోసుకుంటూ దగ్గరిలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లాడు. ఇందులో ఆ ఇద్దరి వెర్షన్ కూడా తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్‌గా ట్రోల్ అవుతోంది. ఇలా చేయడం తప్పని ఆ కస్టమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఐతే, బైక్ బుకింగ్ ఓకే చేసుకునే ముందే ఇలాంటివి చూసుకోవాలి కదా అని ఇలాంటి అనుభవం ఎదురైన కస్టమర్లు మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది.. కస్టమర్‌కు ఏమైనా హెల్త్ ప్రోబ్లమ్ ఉందేమో లేదా నడవలేని స్థితిలో ఉన్నాడేమో అన్న అనుమానం కూడా చాలా మందిలో వస్తోంది. అలా పార్ట్‌టైం సంపాదన కోసం ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ యాప్‌ల ద్వారా పని చేసే వాళ్ళు కూడా మనుషులేనని, వాళ్ళని చులకనగా చూడొద్దని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతోంది.