చత్తీస్‌గఢ్ అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మరణించారు. మావోయిస్టులను తుదముట్టించేందుకు అమిత్ షా 2026 మార్చిని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అగ్రనేతలు లేకపోవడం, వ్యూహ రచనలో విఫలం అవుతుండటంతో మావోయిస్టు ఉద్యమానికి తెరపడే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది.