తెలంగాణ రాష్ట్రం సాదించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో..
అలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అనుకున్న స్థాయిలో ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదని నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఉద్యోగ నియామకాలు విషయంలో ఎన్నో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వంలో చలనం లేదని వాపోతున్నారు.
ఇక ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఆశలు వదులుకున్నారు కూడా..
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే ఎక్కువ నియామక ప్రక్రియ జరిగిందని అంటున్నారు నిరుద్యోగులు.
ఇక పోతే తెలంగాణ లో ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఉద్యోగ నోటిఫికేషన్ ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అంటూ ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తూనే ఉంది.
ఎలాగో ఒకలా ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది అన్నట్టుగా కవరింగ్ ఇస్తూ ఎలక్షన్ అయిపోగానే ఆ మ్యాటర్ వదిలేస్తుంది ప్రభుత్వం.
ఇక తాజా ఎలక్షన్ కూడా ఇలాగే ఉంటుందని నిరుద్యోగులు మండి పడుతున్నారు.
ఇక చూడాలి మరి ప్రభుత్వం ఈ సారి అయినా నియామక ప్రక్రియ నిజంగా చేపడుతుందా లేక మళ్లీ నిరుద్యోగులను బకరాలను చేస్తుందా..