జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఓ వైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉంటే.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బంధువు ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన కేటీఆర్‌కు రాజకీయంగా ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.