బీఆర్ఎస్ పార్టీ పాలనలో సింహంలా కనిపించిన కేటీఆర్ ఒక్కసారిగా భయపడిపోయారా? ‘గత రెండు రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ వేధింపులు ఆరంభం మాత్రమే, ముందు ముందు మరింతగా పెరుగుతాయి. వాటిని తట్టుకుని నిలబడాల్సి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన స్కాములపై కాంగ్రెస్ విచారణ చేయిస్తుంది. అయితే వీటిలో బీఆర్ఎస్ లో కీ రోల్ పోషించిన నేతలే ఇరుక్కునే అవకాశాలు ఉండటంతోనే ఆయన ఇలా అన్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.