Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సామాన్యుల పక్షమా? భూ అక్రమ దారుల పక్షమా?

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సామాన్యుల పక్షమా? భూ అక్రమ దారుల పక్షమా?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదేపల్లి గ్రామ శివారులోని 274 సర్వే నంబర్లు దళిత గిరిజనులకు 2013 సంవత్సరంలో ఏడో విడత భూ పంపిణీ చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం హద్దులు చూపించలేదు. అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా భారతపు గుండయ్య, భారతపు మంజుల ధర్మపురి వాసులు కొప్పుల ఈశ్వర్ అండదండలతో వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఎన్నోసార్లు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ ద్వారా పోరాటం చేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు అక్రమ దారుల దగ్గర డబ్బులు తీసుకొని పేదలకు భూములు లాగేసుకుంటున్నారు అని పేద రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా గాదేపల్లి లోని మాజీ సర్పంచ్ భర్త, భారత మంజుల కు దగ్గరగా ఉంటూ లక్ష్మణ్ కుమార్ ను గాదెపల్లి గ్రామానికి రాకుండా కాంగ్రెస్ నాయకులతో లోపాయి కారు ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ నాయకులను దగ్గర పెట్టుకొని లక్ష్మణ్ కుమార్ ను గాదెపల్లి రావడానికి అడ్డుకుంటున్నాడు అని గ్రామంలోని పేదవారు బాధపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి గ్రామం తిరిగిండు గాదెపల్లి గ్రామానికి వస్తే భూముల విషయాలు అడుగుతారు అని చెప్పి మధ్యవర్తులు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img