కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని వైసీపీ నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చిన వ్యక్తి చివరి నిమిషంలో పసుపు కుంకుమల కింది ఇస్తానని మోసాం చేశారని అంటున్నారు. సీఎం జగన్ మహిళల కోసం వందల పథకాలు తెచ్చి అమలు చేస్తున్నారని అన్నారు. టీడీపీకి ఓటేసిన భర్తలను ఇంట్లోకి రానివ్వకూడదని భార్యలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారని మంత్రి పెద్దారెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.