Homeహైదరాబాద్latest News'పుష్ప 2' కూడా బ్లాక్ బస్టరేనా..?

‘పుష్ప 2’ కూడా బ్లాక్ బస్టరేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ కోసం ‘పుష్ప 2’ సినిమా స్పెషల్ షో వేశారు. అయితే సినిమా అవుట్ ఫుట్ చూశాక అల్లు అరవింద్ చాలా హ్యాపీగా ఉన్నారు అని టాక్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది.సెకండాఫ్ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 3 గంటల 22 నిముషాలు ఉందిని తెలుస్తుంది. ఈ సినిమా కచ్చితంగా వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అల్లు అరవింద్ అన్నారు అని టాక్. ఈ సినిమాలో ప్రతి పావు గంటకు ఓ హైప్ సీన్ ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతారు చూడాలి. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పుష్ప 2’ సినిమాని ఒకరోజు ముందుగా యూఎస్ లో డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేయనున్నారు.

Recent

- Advertisment -spot_img