Homeఅంతర్జాతీయంరిలియన్స్​ చేతుల్లోకి టిక్​టాక్​...?

రిలియన్స్​ చేతుల్లోకి టిక్​టాక్​…?

దేశ వ్యాప్తంగా టిక్​టాక్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వారకు దీనికి బానిస అయిన వారు ఉన్నారు. ఇక యువత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది యువత, ప్రత్యేకంగా మహిళలు కూడా టిక్ టాక్ పై చాలా ఆసక్తితో ఉంటారు. ఇంట్లో ఉండే ఆడవారు అయితే చాలా మందే తమలోని ట్యాలెంట్​ను టిక్​టాక్​ ద్వారా ప్రపంచానికి చూపించారు. ఇక ఈ మద్య కాలంలో భారత్-చైనా మధ్య నెలకొన్న రాజకీయ అంతరాలతో సమాచార రక్షణలో టిక్​టాక్​ ప్రమాదకరంగా మారవచ్చని కేంద్రం టిక్​టాక్​ను నిషేదించింది. ఇక ఇదే బాటలో అమెరికా కూడా నడవనున్నట్లు సమాచారం. దీంతో ఈ పరిస్థితులను అధిగమించేందుకు టిక్​టాక్​ యాజమాన్యం సంస్థలోని మెజారిటీ షేర్లను చైనాయేతర దేశ సంస్థలకు అమ్మాలని చూస్తున్నట్లు తెలిసిందే అయితే ఈ క్రమంలో మన దేశానికి చెందిన రిలియన్స్​ గ్రూప్​ దీన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీంతో టిక్​టాక్​ ప్రియులకు మళ్ళీ వారి ఫేవరెట్​ యాప్​ తమకు అందుబాటులోకి వస్తుందని ఆనందపడుతున్నారు. చూడాలి మరి టిక్​టాక్​ ఎవరి చేతుల్లోకి వెలుతుందో.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img