Homeహైదరాబాద్latest NewsSalaar పార్ట్ 3 అసలు నిజం చెప్పేసిందా?

Salaar పార్ట్ 3 అసలు నిజం చెప్పేసిందా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కాలేదు. యాక్షన్‌ సినిమా కావడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సలార్ సినిమా మొదటి భాగానికి ‘సలార్: పార్ట్ వన్ – సీఫైర్’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు రెండో భాగానికి ‘ సలార్ : పార్ట్ టూ – శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ పెట్టారు. సలార్ పార్ట్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ పార్ట్ 3 కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాను కూడా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే రెండు పార్ట్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలోనే పార్ట్ 3 కూడా రాబోతుంది. అలాగే సలార్ కూడా మూడో పార్ట్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ నీల్ భార్య లిఖితా నీల్ సోషల్ మీడియాలో ఇటీవల ‘ఆస్క్ మీ’ సెషన్‌ను నిర్వహించింది. ఓ నెటిజన్ ఆమెను ‘సలార్ 3′ వస్తుందా.? అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ..దీని పై ఆమె స్పందిస్తూ సెకండ్ పార్ట్ పూర్తయిన తర్వాతే దీనిపై సమాధానం చెబుతాం’ అని అన్నారు. ఈ మాటను ఆమె జోక్‌గా అన్నారా లేక సీరియస్‌గాఅన్నది మాత్రం అర్ధం కాలేదు. ఇక రీసెంట్ గా సలార్ సక్సెస్ పార్టీ చేసుకుంది చిత్ర బృందం. ఈ పార్టీలో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గందూర్, హీరో ప్రభాస్, హీరోయిన్ శృతిహాసన్, నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు రవి బస్రూరు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img