Homeహైదరాబాద్latest Newsరష్యాలో 'శృంగారానికి మంత్రిత్వ శాఖ'.. ఏర్పాటుకు గల కారణం అదేనా ..?

రష్యాలో ‘శృంగారానికి మంత్రిత్వ శాఖ’.. ఏర్పాటుకు గల కారణం అదేనా ..?

రష్యా ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోయింది. దీనికి తోడు ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం భారీ ప్రాణనష్టాన్ని కలిగిస్తోంది. అయితే క్షీణిస్తున్న జనన రేటును ఎదుర్కోవడానికి విస్తృత వ్యూహంలో భాగంగా రష్యా “శృంగార మంత్రిత్వ శాఖ” ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
దేశంలో జననాల రేటును ఎలా పెంచాలనే దానిపై అనేక ఆలోచనలు ఉన్నాయి. రాత్రి వేళల్లో కరెంటును నిలిపివేయాలని, ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని ఆలోచిస్తోంది. వీటి వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుందని నమ్ముతారు, ఇది పిల్లల పుట్టుకకు దోహదం చేస్తుంది భావిస్తోంది. అలాగే, ఇంట్లో ఉండే తల్లులకు వేతనాలు ఇవ్వడం, హోటళ్లలో ఉండే జంటల ఖర్చులను భరించడం, డేటింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా జనన రేటును పెంచాలనే ఆలోచన వచ్చింది.ఈ ఏడాది ప్రథమార్థంలో రష్యాలో 5,99,600 మంది పిల్లలు జన్మించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 16 వేల జననాలు తక్కువగా నమోదయ్యాయి. అయితే జనవరి మరియు జూన్ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయి.

Recent

- Advertisment -spot_img