AP : జనసేన పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ వెస్ట్ స్థానం ఆశించారు పోతిన మహేష్. ఈసారి అక్కడి నుంచి ఎలాగైనా బరిలోకి దిగాలని భావించారు. అయితే ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కగా.. బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే అసంతృప్తికి గురైన పోతిన మహేష్.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
“పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది . పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. జనసేన పార్టీ నిర్మాణం మీద, క్యాడర్ మీద ఏరోజు కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించలేదు. పవన్‌ది అంతా నటనే. పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్ధ పూరితం. పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు” అంటూ పోతిన మహేష్ విమర్శించారు.