Homeహైదరాబాద్latest Newsఆ స్టార్​ హీరోయిన్ కు జైలు జీవితం తప్పదా?

ఆ స్టార్​ హీరోయిన్ కు జైలు జీవితం తప్పదా?

మాజీ ఎంపీ, వెటరన్ సినీ నటి జయప్రదకు మ‌రో షాక్ త‌గిలింది. ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడ‌గా లేటెస్ట్ గా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది. రాజకీయ నాయకురాలుగా మారిన నటి జయప్రదను అరెస్టు చేసి ఫిబ్రవరి 27న కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు పోలీసులను ఆదేశించింది. జయప్రదపై ఏడోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత కూడా ఆమె విచారణకు కోర్టుకు రాలేదని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ తివారీ తెలిపారు. దీంతో ఆమెకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. జయప్రదను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుసుక్కున పోలీసులకు దొరికిందో ఈమె జైలుకే అనే కామెంట్లు నెటిజన్ల నుంచి వచ్చేలా చేస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం.. కోర్టు ఆదేశాలను లైట్ తీసుకున్న జయప్రద తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! జయప్రద 2019లో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి. కానీ నిర్ణీత తేదీల్లో విచారణకు జయప్రద కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఒకదాని తర్వాత ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు. కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించ లేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ అయింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, అరెస్టు చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో తీసుకురావాలంటూ రామ్ పూర్ ఎస్పీని ఆదేశించింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img