దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అంటూ షాద్ నగర్ సంఘటనపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అంటూ ఆగ్రహించారు. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! అంటూ రెచ్చిపోయారు. ఇంత కర్కశత్వమా… సిగ్గు సిగ్గు..! కొడుకు ముందే చిత్ర హింసలా? అంటూ మండిపడ్డారు.