సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల, రేవతి మరణం, అల్లు అర్జున్ అరెస్ట్ ..ఈ వరుస పరిణామాలను చూస్తుంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి కూడా పోలీసులు విడుదల చేయలేదు. కోర్టు కాపీ లభించకపోవడంతో రాత్రంతా జైల్లో ఉంచి ఉదయం విడుదల చేశారు. అయితే ఇదంతా మెగా బ్రదర్స్ కుట్ర అని కొందరు భావిస్తున్నారు.
మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య కొద్ది కాలంగా విభేదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక పుష్ప-2 విడుదల సమయంలో కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించలేదు. దీంతో అల్లుఅర్జున్ అరెస్ట్ లో మెగా ఫ్యామిలీ కుట్ర కూడా ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
మరోపక్క జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలిశారు. అయితే కుటుంబ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి అల్లు అరవింద్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తాడా లేక ఇది వైరల్ టాక్ మాత్రమేనా అనేది రానున్న రోజుల్లో వేచి చూడాలి. దీనిపై ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఏమీ మాట్లాడలేదు.