దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.. పుట్టిన రెండు రోజులకే కవల కూతుళ్లను చంపాడు. నీరజ్ సోలంకి, పూజ ఇద్దరు దంపతులు. ఈ ఏడాది మే 30న కవల పిల్లలకు పూజ జన్మనిచ్చింది. జూన్ 1న ఆసుపత్రి నుంచి కవల పిల్లలతో కారులో వెళ్ళిన నీరజ్ కూతుళ్లను హత్య చేశాడు. ఢిల్లీ శివారులోని పూత్ కలాన్‌లో పాతిపెట్టి పరారయ్యాడు. అయితే కవలలిద్దరూ ఆడ బిడ్డలు కావడంతోనే ఈ హత్య చేసినట్లు సమాచారం.