సూపర్ మార్కెట్స్, ఎటిఎంలు మరియు రెస్టారెంట్స్ లో ఇచ్చే బిల్స్ ముట్టుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఏమైనా హానికరమా ఇవాళ తెలుసుకుందాం.. ఈ రెసిప్స్ అన్ని థర్మల్ పేపర్ మీద ప్రింట్ అవుతాయి. వీటిలో బిస్పెనాల్ ఏ బిపిఏ అనే రసాయనం ఉంటుంది. ఇది హార్మోన్స్ ని ప్రభావితం చేస్తుంది ఈ బిల్స్ ని ముట్టుకున్నప్పుడు ఆ బిపిఎ మన స్కిన్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ బిపిఏ మన శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లక్షణాలని అనుకరిస్తుంది దీనివల్ల అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పురుషుల్లోనూ స్త్రీలో దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు చాలా అధ్యయనాల్లో ఈ బిపిఏ క్యాన్సర్ కారకంగా ఉంటుందని కూడా తెలుస్తోంది. బెస్ట్ థింక్ ఏంటంటే.. ఈ బిల్లుల్ని ఎక్కువగా ముట్టుకోవడం తగ్గించేయాలి సాధ్యమైనంత వరకు డిజిటల్ రిసీట్స్ ని ఎంచుకోండి. ఈ బిల్స్ ముట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి. ఈ మధ్యకాలంలో బిపిఏ బదులుగా బిపిఎస్ అనే రసాయనం ఎక్కువగా ఉపయోగిస్తున్నామని కూడా చెప్తున్నారు. బట్ ఇది కూడా హానికరమే కాబట్టి మన హెల్త్ ని కాపాడుకునేందుకు బిల్స్ తో ఎంత తక్కువ కాంటాక్ట్ అయితే అంత మంచిది.