Homeహైదరాబాద్latest NewsIshan Kishan : ఇషాన్ కిషన్ ముంబై తరఫున ఆడుతున్నాడా.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా..?

Ishan Kishan : ఇషాన్ కిషన్ ముంబై తరఫున ఆడుతున్నాడా.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా..?

Ishan Kishan : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ముంబై తరఫున ఆడుతున్నాడా అనే ప్రశ్న వచ్చింది. అలాగే అతను మ్యాచ్ ఫిక్సింగ్ చేసాడు అని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అంపైర్లు అవుట్ ఇవ్వకపోయినా అతను ఔట్ కావడం ప్రశ్నార్థకం అయింది. ఐదుసార్లు ఛాంపియన్‌లతో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన అతను ఇంకా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడా అని నెటిజన్లు కీపర్-బ్యాటర్‌ను ట్రోల్ చేశారు.

అసలు ఏమి జరిగింది అంటే.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ పడిన బంతిని ఫ్లిక్ చేసేందుకు ఇషాన్ కిషన్ ప్రయత్నించాడు. కానీ ఆ బాల్‌ ఇషాన్ బ్యాట్‌కు తగల్లేదు. కానీ ఎడ్జ్ తీసుకున్నట్లు అనిపించింది. ఈ క్రమంలో ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయకపోయినా అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. అయితే ఇషాన్ రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత రీప్లేలో ఇషాన్ నాటౌట్ అని తేలింది. బాల్ అతడి బ్యాట్‌కు తగల్లేదని అల్ట్రా ఎడ్జ్‌లో క్లారిటీగా కనిపించింది. దీంతో ఇషాన్‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img