ఇజ్రాయెల్ మరోసారి గాజాపై భీకర దాడులు చేసింది. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది.
ఈ దాడిలో మొత్తం 21 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. నిరాశ్రయులైన ప్రజలు డెయిర్ అల్-బలాహ్ హాస్పిటల్ సమీపంలోని మసీదులో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.