ISRO : మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో
ISRO : ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్‌వీ – డీ1 రాకెట్ ప్రయోగం
రాకెట్ ద్వారా ఈఓఎస్ -02, ఆజాదీశాట్ అనే ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో
భూపరిశోధనల కోసం ఉపయోగపడనున్న 137 కేజీల బరువైన ఈఓఎస్ 02 ఉపగ్రహం
భారత గ్రామీణ ప్రాంత విద్యార్థినిలు రూపొందించిన 8 కేజీల బరువైన ఆజాదీశాట్ ఉపగ్రహం
కొత్త వాహకనౌక ద్వారా తమ ప్రయోగాన్ని చేపట్టనున్న శాస్త్రవేత్తలు
ఇప్పటి వరకు పిఎస్ఎల్‌వీ రాకెట్ ల ద్వారా వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో
మొదట సౌండింగ్ రాకెట్, ఎస్ఎల్‌వీ, ఏఎస్ఎల్‌వీలను రూపొందించిన ఇస్రో
తర్వాత పిఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ రాకెట్ ల ద్వారా ప్రయోగాలు
మార్క్ 3 వంటి బాహుబలి రాకెట్ ను రూపొందించి అనేక విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో
తాజాగా ఎస్ఎస్ఎల్‌వీ ద్వారా ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తలు
తక్కువ ఖర్చుతో తక్కువ ఎత్తులో 500 కేజీల లోపు బరువు కలిగిన ఉపగ్రహాల ప్రయోగం కోసం రాకెట్ తయారీ
2016 నుంచి రాకెట్ పై ద్రుష్టి పెట్టి ఇటీవల 30 కోట్ల వ్యయంతో ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ ను తయారుచేసిన ఇస్రో
రేపు ఉదయం 2.18 గంటలకు ప్రారంభం కానున్న కౌంట్ డౌన్, 7 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనున్న కౌంట్ డౌన్
షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రత, షార్ కి చేరుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్
షార్ లో సన్నద్దతా సమావేశం నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు