Homeహైదరాబాద్latest Newsటీవీ5 అధినేతే టీటీడీ ఛైర్మన్?.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..!

టీవీ5 అధినేతే టీటీడీ ఛైర్మన్?.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..!

ఇదే నిజం, ఏపీ బ్యూరో : టీటీడీ చైర్మన్​ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భూమన టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగాక ఆ ప్లేసులో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే నాగబాబు ఇదంతా ఫేక్​ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు న్యూస్​ ఛానల్ టీవీ5, హిందూ ధర్మం ఛానెల్ చైర్మన్ బీఆర్ నాయుడు(బొల్లినేని రవీంద్ర నాథ్ నాయుడు)ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఎన్నికల సమయంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటి టీవీ5​. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో నిత్యం మాజీ సీఎం జగన్​కు వ్యతిరేకంగా పని చేస్తూ వైసీపీ నేతలపై పలు కథనాలు ప్రసారం చేసింది. ఈ క్రమంలో జగన్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఆర్​ నాయుడు పై పలు కేసులు పెట్టి వేధించారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తెలుగు ప్రజల్లో టీవీ5 టీడీపీకి మద్దతుగా నిలిచే చానల్​ అని బలంగా నాటుకుపోయింది. ఎంతో కీలకమైన టీటీడీ చైర్మన్ పోస్టు కోసం హేమాహేమీలు పోటీ పడుతుండగా బీఆర్ నాయుడు పేరు తెరమీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి సామాజిక వర్గం కారణంగానో లేక రాజకీయంగా నిలదొక్కుకోవడానికి వెన్నుదన్నుగా నిలిచాడన్న భావనతోనో కానీ సీఎం చంద్రబాబు బీఆర్​ నాయుడుకే టీటీడీ చైర్మన్​ పదవి ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

Recent

- Advertisment -spot_img