Homeహైదరాబాద్latest Newsభారత్‌లో ఎమర్జెన్సీ విధించి నేటికి 49 ఏళ్ళు.. ఎమర్జెన్సీ ఎందుకు విధించారంటే..?

భారత్‌లో ఎమర్జెన్సీ విధించి నేటికి 49 ఏళ్ళు.. ఎమర్జెన్సీ ఎందుకు విధించారంటే..?

భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 49 ఏళ్లు అయ్యింది. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ 21 మార్చి 1977న ముగిసింది.

భారత్‌లో ఎమర్జెన్సీ విధించడానికి కారణం ఇదే!
రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పేదలకు లబ్ధి కలిగించే పురోగమన చర్యలను తాను ప్రారంభించినప్పటి నుంచి బలమైన కుట్ర మొదలైందని ఇందిర ఆరోపించారు.

భారత ఎమర్జెన్సీ.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ!
భారతదేశ చరిత్రలో ఈ రోజు ఒక ‘బ్లాక్ డే’. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాంతో దేశంలో పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెట్టారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ముగిసింది.

Recent

- Advertisment -spot_img