ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుపు తథ్యం’ అని జోస్యం చెప్పారు.