Homeహైదరాబాద్latest Newsఉచిత కరెంట్‌ మీరు పొందాలంటే అది తప్పనిసరి..!

ఉచిత కరెంట్‌ మీరు పొందాలంటే అది తప్పనిసరి..!

తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. 2024 మార్చి నెలలో ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ఈ పథకం లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లు వస్తుంది. అయితే ఉచిత కరెంట్‌ను సద్వినియోగం చేసుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. వారి విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. లేదంటే ఈ పథకం వర్తించదు. 200 యూనిట్లు దాటిన వారు కచ్చితంగా కరెంటు బిల్లు చెల్లించాల్సిందే. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అర్హులైన రెండు లక్షల మంది వినియోగదారులు ఈ నెల 200 యూనిట్ల పరిమితి దాటిపోవడంతో జీరో కరెంటు బిల్లును కోల్పోతున్నారు. మరియు అలాంటి వినియోగదారులు ఈ పథకానికి అర్హులైతే, ఈ పథకంలో కొనసాగడానికి వారి విద్యుత్ వినియోగాన్ని తప్పనిసరిగా తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img