Homeహైదరాబాద్latest Newsవేణుస్వామి ఇక మూసుకుంటే బెటర్.. కల్కి విషయంలో మళ్ళీ బుక్కైన వేణుస్వామి!

వేణుస్వామి ఇక మూసుకుంటే బెటర్.. కల్కి విషయంలో మళ్ళీ బుక్కైన వేణుస్వామి!

వేణుస్వామికి టైం అస్సలు బాగున్నట్లు లేదు. కల్కి భారీ విజయంతో వేణుస్వామి జోస్యం మరోసారి బెడిసికొట్టింది. మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి , వేణుస్వామికి అస్సలు పడదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదని.. అతని సినిమాలు ఆడవని, పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అలాగే కల్కి సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని, ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి జోస్యం చెప్పారు.

అయితే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నిన్న(27-06-2024) ప్రేక్షకుల ముందుకు వచ్చి మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో తొలి రోజు వసూళ్ల సునామీ సృష్టించింది. అవలీలగా రూ.1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్‌కు దిగారు. మా హీరో కెరీర్ ఖతమేనన్న పెద్దమనిషి ఎక్కడ అంటూ వారు ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి తన జాతకం చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ అయితే.. వేణుస్వామి ఇక మూసుకుంటే మంచిది అని మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img