Homeలైఫ్‌స్టైల్‌అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టమే

అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టమే

ఏదైనా అతి చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాటని మరోసారి గుర్తు చేస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా మహిళలు వ్యాయామం విషయంలో అతి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

ఎందుకలా అంటే సంతాన లేమి సమస్యలకు అతి వ్యాయామం కూడా ఓ కారణమని డాక్లర్ల పరిశోధనలో తేలింది.

ఆరోగ్యం కోసం ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో స్లిమ్‌ గా ఉండాలని, ఫిట్‌ గా కనిపించాలనే తాపత్రయం మహిళల్లో కూడా ఎక్కువైంది.

అయితే సరైన ఆహారం తీసుకోకుండా శక్తికి మించి వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా మహిళా క్రీడాకారుల్లో తరచూ ప్రాక్చర్లు కావడం, గాయాలపాలవడం, అనారోగ్యం పాలవడానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమేనంటున్నారు.

తక్కువ తినడం వల్ల , ఎక్కువ వ్యాయామం వల్ల ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోదంటున్నారు.

ఫలితంగా ఎముకల్లో బలం తగ్గి త్వరగా ప్రాక్చర్లు అవుతున్నాయని చెబుతున్నారు. అలాగే బుతుక్రమం సరిగా ఉండటం లేదని తేల్చారు.

పీరియడ్స్‌ ఆలస్యం రావడం లేకపోతే రెగ్యులర్‌ గా రాకపోవడం తదితరకారణాల వల్ల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయని డాక్టర్ల పరిశోధనలో తేలింది.

కాబట్టి మహిళలు వ్యాయామం విషయంలో అతి చేయకుండా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు. అంతేకాదు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. 

Recent

- Advertisment -spot_img