HomeతెలంగాణHyderabadను మరో మెట్టు ఎక్కించే బాధ్యత కొత్త ప్రభుత్వానిదే..

Hyderabadను మరో మెట్టు ఎక్కించే బాధ్యత కొత్త ప్రభుత్వానిదే..

అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్‌ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ ఇండెక్స్‌’ తాజా నివేదిక (2023) తేల్చింది. మెర్సర్స్‌ వరల్డ్‌ వైడ్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ (జీవన నాణ్యత) తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి హైదరాబాద్‌కు అత్యుత్తమ ర్యాంక్‌ దక్కింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అంతర్జాతీయ సూచీలో హైదరాబాద్‌ ఘనత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేండ్లకాలంలో హైదరాబాద్‌ నగరం ఆరుసార్లు మెర్సర్‌ జాబితాలో టాప్‌లోనే నిలిచిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కృషి చేశామని తెలిపారు. ఇప్పుడు దాన్ని మరో మెట్టు ఎక్కించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు. మెర్సర్స్‌ జీవన నాణ్యత ర్యాంకింగ్స్‌లో బెంగళూరు, పుణే వంటి నగరాలను భాగ్యనగరం వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ 153వ స్థానంలో నిలువగా, పుణెకు 154, బెంగళూరుకు 156 ర్యాంకులు దక్కాయి. చెన్నై(161), ముంబై (164), కోల్‌కతా (170), న్యూఢిల్లీ (172) నగరాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో విదేశీ ఉద్యోగులు, ప్రవాసులు, వారి కుటుంబాల రోజువారీ జీవనం.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ‘మెర్సర్స్‌’ ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది.

Recent

- Advertisment -spot_img