ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రపంచ జ్ఞాని మేధావి జ్ఞాన శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ రాంజీ అంబేద్కర్ సాక్షిగా యావత్తు భారతదేశ ప్రజలు అమిత్ షా చేసిన వాక్యాల పైన తీవ్ర దుమారం రేపుతున్నది.అత్యున్నతమైన పదవిలో ఉన్న అమీషా అంబేద్కర్ పైన వ్యంగమైన పదజాలాన్ని వాడడం చాలా దురదృష్టకరం ఆర్థికవేత్త న్యాయ కోవిదుడు రాజనీతజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి అంటరానితనం వివక్షపై మరియు హక్కులకై అలుపెరుగని పోరాటం చేసిన భారతరత్న అంబేద్కర్ ని అవమానించే ధైర్యం నీకు ఎక్కడిది అమిత్ షా వెంటనే నీ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా జెఎసి నాయకులు నల్ల శ్యామ్,సురమల్ల సతీష్,గొర్రె జాకాబ్,పొన్నగంటి రత్నం,మ్యదరి రమేష్,భోజనపు శ్రీనివాస్,కూన రాజేందర్,జనప వెంకటేష్,జనప శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.