- కోహినూర్ గ్రూప్స్ కార్యాలయంలో ముమ్మర సోదాలు
- వికారాబాద్ జిల్లా తాండూరులోనూ తనిఖీలు
ఇదేనిజం, హైదరాబాద్: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఐటీ అధికారులు, పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కోహినూర్ గ్రూప్స్ అధినేత మజీద్ ఖాన్ లక్ష్యంగా రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఆయన ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూరుస్తున్నట్టు సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కింగ్స్ గ్రూప్ ఓనర్ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్‌పై ఐటీ సోదాలు జరుపుతున్నారు. హోటల్ యజమాని శేఖర్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.