Homeరాజకీయాలుమిర్యాలగూడ BRS అభ్యర్థి ఇంట్లో IT Rides

మిర్యాలగూడ BRS అభ్యర్థి ఇంట్లో IT Rides

– 40 బృందాలతో హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో తనిఖీలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మళ్లీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. 40 బృందాలతో హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. భాస్కరరావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. భాస్కరరావు అనుచరుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రైస్‌ మిల్‌ యజమానులు రంగా శ్రీధర్‌, రంగా రంజిత్‌, బండారు కుశలయ్య ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండలోని రవీందర్‌నగర్‌, పాతబస్తీలో తనిఖీలు జరుగుతున్నాయి. మహేందర్‌ ఆయిల్‌ మిల్‌ యజమాని మహేందర్‌ ఇల్లు, రైస్‌ మిల్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మహేందర్‌కు సంబంధించిన 7 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.


నాకు ఎలాంటి కంపెనీలు లేవు


ఐటీ సోదాలపై మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు స్పందించారు. ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం వేములపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఐటీ అధికారుల సోదాలపై మీడియాతో మాట్లాడారు. ‘ఐటీ అధికారులు ఎవరూ నన్ను కలవలేదు. రైస్‌ మిల్లుల పైనే దాడులు జరుగుతున్నాయి. రైస్‌ మిల్లర్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు నాపై ఆరోపణలు చేస్తున్నాయి. నాకు ఎలాంటి కంపెనీలు లేవు. నా దగ్గర డబ్బులు లేవు.. ఎక్కడైనా చూపిస్తే ఇచ్చేస్తా’అని నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img