నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధిస్తాడని భారతీయులు అందరు ఆశిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ పారిస్‌లో కూడా అదే పునరావృతం చేస్తాడని అందరూ ఆశించారు. అందరు అనుకున్నట్లుగానే పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రో దిగ్గజం నీరజ్ చోప్రా సత్తా చాటాడు. క్వాలిఫికేషన్ రెండో రౌండ్‌లో 89.34 మీటర్లు జావెలిన్ విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొదటి ర్యాంక్‌లో కొనసాగుతున్న నీరజ్ చోప్రా ఫైనల్స్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.