ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన మరోసారి బయటపడింది. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలుచేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.