Homeహైదరాబాద్latest Newsఇటలీ ప్రధానిపై పోర్న్ వీడియో, లక్ష యూరోల నష్ట పరిహారం

ఇటలీ ప్రధానిపై పోర్న్ వీడియో, లక్ష యూరోల నష్ట పరిహారం


రోమ్‌: డీప్‌ఫేక్ వీడియోపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఘాటుగా స్పందించారు. లక్ష యూరోల న‌ష్ట‌ప‌రిహారాన్ని కోరుతూ పరువునష్టం దావా వేశారు. అమెరికాలోని పోర్న్ వెబ్‌సైట్ల‌లో ఆ వీడియోలు అప్‌లోడ్ అయ్యాయ‌ని, వాటిని ల‌క్ష‌లాది మంది వీక్షించార‌ని మెలోనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో 40 ఏళ్ల వ్య‌క్తితో పాటు అత‌ని తండ్రి ని అరెస్టు చేశారు.

స్మార్ట్‌ఫోన్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులు అప్‌లోడ్ చేశార‌ని, వాళ్ల‌ను ట్రాక్ చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఇట‌లీ ప్ర‌ధానిగా జార్జియా నియామ‌కం కాక‌ముందే.. 2022లో ఆ డీప్‌ఫేక్ వీడియోల‌ను క్రియేట్‌ చేశారు. ఇట‌లీలో న‌ష్ట‌ప‌రిహారం కేసుల‌ను నేరాభియోగ కేసులుగా గుర్తిస్తారు. ఆ కేసుల్లో నిందితుల‌కు జైలుశిక్ష విధిస్తారు. జూలై 2వ తేదీన ఈ కేసులో మెలోనీ కోర్టు ముందు హాజ‌రుకానున్నారు.

మెలోనీ త‌న‌కు వ‌చ్చే న‌ష్ట‌ప‌రిహారాన్ని మ‌హిళ‌ల స‌పోర్టు కోసం ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఆమె త‌ర‌పున లీగ‌ల్ టీమ్ తెలిపింది.

Recent

- Advertisment -spot_img