Homeహైదరాబాద్latest Newsతప్పంతా అల్లు అర్జున్ దే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తప్పంతా అల్లు అర్జున్ దే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. మంగళగిరిలో పవన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గొడ్డలితో చేసేది గొడ్డలి పెట్టునకు తెచ్చారని వ్యాఖ్యానించారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హీరో థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదు అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ సిబ్బంది అయినా ఆయనకు చెప్పాల్సింది అని అన్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించి ఉంటె బాగుండేది అని తెలిపారు. తన పేరు చెప్పలేదని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని పవన్ పేర్కొన్నారు. అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదు అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Recent

- Advertisment -spot_img