Homeహైదరాబాద్latest Newsదారుణం.. కన్న కొడుకే కాలయముడై..తండ్రిని కిరాతకంగా హతమార్చాడు

దారుణం.. కన్న కొడుకే కాలయముడై..తండ్రిని కిరాతకంగా హతమార్చాడు

కన్న కొడుకే కాలయముడై.. కని పెంచిన తండ్రిని కిరాతకంగా హతమార్చాడు ఓ కొడుకు. తాగుడుకు బానిసైన ఓ కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన ఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ ఫారూఖ్(35) తాగుడుకు బానిసై తల్లిదండ్రులను డబ్బు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి ఫారుక్ తాగేందుకు డబ్బు ఇవ్వమని మరోసారి వేధించాడు. అందుకు అతని తండ్రి వలీఖాన్(60) నిరాకరించగా ఆగ్రహానికి లోనైన ఫారూఖ్ కత్తితో పొడిచాడు. దీంతో వలీ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Recent

- Advertisment -spot_img