Jaat Movie : టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ హీరోగా ”జాట్” అనే సినిమా తీసాడు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదలై మంచి విజయం సాధించింది. కానీ ఈ సినిమాకి ఊహంచని దెబ్బ తగిలింది. తమిళనాడులో ”జాట్” సినిమాను బాయ్‌కాట్ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. #BoycottJaatMovie అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండు చేస్తున్నారు.ఈ సినిమా తమిళుల మనోభావాలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ శ్రీలంక నుంచి పారిపోతాడు. జాఫ్నా టైగర్ ఫోర్స్ పేరుతో పోలీసుల హిట్ లిస్టులో ఉన్నాడు. అయితే, జాఫ్నా చాలా మంది తమిళులు నివసించే ప్రదేశం. ఎల్టీటీఈని స్థాపించిన ప్రభాకరన్ అక్కడే పుట్టాడు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడారు. అయితే, సినిమాలో చూపించిన జాఫ్నా టైగర్ ఫోర్స్ LTTE పోలికలను కలిగి ఉందని, ప్రభాకరన్ తమిళుల కోసం పోరాడినప్పటికీ, సినిమాలో వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, తమిళులను కించపరిచారని తమిళులు విమర్శిస్తున్నారు. ఈ సినిమాని ఇప్పటికే కొన్ని థియేటర్ల నుండి తొలగించారు. అయితే తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తమిళనాడులో అడుగుపెడితే, వారు ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తమిళులు హెచ్చరిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్స, హీరోకు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.