జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతని భార్య స్టెల్లా త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా స్టెల్లా మెటర్నీటీ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను యాదమ్మ రాజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. యాదమ్మ రాజు ఒక సాధారణ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. పటాస్ టీవీషోలో కామెడీ స్కిట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.