నేడు వైసీపీ పార్టీ నేతలు సమావేశం వై.ఎస్.జగన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.జగన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం.. టీడీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది అని వై.ఎస్. జగన్ అన్నారు. ప్రజలు రాష్ట్రంలో ఒక్కపుడు జగన్ కనీసం పలావ్ పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు..ఇప్పుడు తీరా చూస్తే పలావ్ పోయింది.. బిర్యానీ పోయింది అని ఇదే అంశంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది అని జగన్ తెలిపారు. ఎక్కడ చుసిన రెడ్ బుక్ రాజకీయం జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యవస్థ లని కుప్ప కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అని జగన్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాగం, దొంగ కేసులు పెట్టడం జరుగుతుంది. రాష్ట్రానికి ఒక మంచి చేయక పొగ.. మరోవైపు ప్రశ్నించే గోతును అణచివేయాలని విశ్వరూపం చూపించడం చంద్రబాబు చేస్తున్న పెద్ద తప్పు…క్యారెక్టర్, విశ్వసనీయత అనేది ఒకేసారి వీటిని పడేశారు అంటే మళ్ళీ ఏరుకోడం కష్టం.. కష్టకాలంలో ఉన్నపుడే మనకి అది ఇక పరీక్షా.. ఏ రోజు కూడా ఎల్లకాలం కష్టం ఉండవు.. ఒక చీకటి వచ్చాక పగలు రాక తప్పదు అని జగన్ అన్నారు.